బెల్జియంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. ఓ స్కూల్ బస్సును.. రైలు ఢీకొన్నది. ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ప్రమాద బాధితుల్లో చాలా మంది ఉన్నట్లు బెల్జియం మంత్రి బెర్నార్డ్ క్వింటిన్ తెలిపారు. అయితే అధికారులు మాత్రం కచ్చితమైన మృతుల సంఖ్యను వెల్లడించలేదు. బుగ్గెన్హోట్లో జరిగిన ప్రమాదం విషాదాన్ని నింపిందని, బాధితుల పట్ల సంతాపం చెబుతున్నట్లు మంత్రి తెలిపారు.