గత YSRCP ప్రభుత్వ హయాంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడ పల్లా శ్రీనివాసరావుకు సంబంధించిన భవనాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లా ఫిర్యాదుతో అధికారులపై విచారణ చేసి ముగ్గురు టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేశారు.ముగ్గురు హైకోర్టును ఆశ్రయించగా..హైకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ను రద్దు చేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది.ఈ ముగ్గురు అధికారుల్ని తిరిగి విధుల్లోకి తీసుకున్నా అప్రాధాన్యమైన స్థానాల్లో నియమించనున్నారు.