గోదావరి కాలుష్య నివారణకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తూర్పు గోదావరి జిల్లా వెంకటనగరం వద్ద ఆంధ్రాపేపర్ మిల్స్ వ్యర్థాలు నేరుగా నదిలో కలవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశిస్తూ, దీనిపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేప పార్టీకి చెందిన ఏపీ మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ ఉన్నారు.