తూర్పు లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. మష్గారా అనే ఓ గ్రామంపై జరిపిన దాడిలో 12 మంది మృతి చెందారు. దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు స్పందించారు. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌లపై మరిన్ని దాడులు తీవ్రంగా చేసే అవకాశం ఉందని ప్రకటించారు. లెబనాన్‌లో మరిన్ని అదనపు బెటాలియన్లను తరలిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది.