పశ్చిమబెంగాల్లో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమవలసదారులను స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. ‘మేం చర్యలు ప్రారంభించకముందే పారిపోండి’ అంటూ ముఖ్యమంత్రి తాజాగా హెచ్చరించారు.తక్షణం అక్రమవలసదారులు ఈ ప్రదేశాన్ని వదిలివెళ్లాల్సిందేనని అన్నారు. అక్రమ చొరబాటుదారులను జైళ్లకు పంపవద్దని తాను పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ‘వాళ్లకు మనమెందుకు ఆతిథ్యం ఇవ్వాలి?.. దేశ వనరులను ఎందుకు దుర్వినియోగం చేయాలి. చొరబాటుదారులు ఏమైనా మన అల్లుళ్లా?’ అని ప్రశ్నించారు. తమ పౌరులను వెనక్కి తీసుకునే బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపైనే ఉందన్నారు.