తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు (వేలుమణి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు) పళనిస్వామి తో భేటీ అయ్యారు. పళనిస్వామితో భేటీ అనంతరం వేలుమణి మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో చీలిక లేదని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పళనిస్వామికి పూర్తిగా మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రులు వేలుమణి, సీవీ షణ్ముగం నాయకత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే అధిష్ఠానంపై తిరుగుబాటు చేశారు. టీవీకే (TVK) ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు.