టాలీవుడ్లో కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న రెంటల్, పర్సంటేజీ వివాదానికి తెరపడింది. రాం చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన పెద్ది సినిమాను రెంటల్ పద్దతిలోనే ప్రదర్శించనున్నారు. అయితే.. టికెట్ ధరలు పెంచితే 75 శాతం ఎగ్జిబిటర్లకు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. చిరంజీవీ జోక్యం చేసుకోవడంతో.. పర్సంటేజీకి పట్టుపట్టిన తెలంగాణ ఎగ్జిబిటరల్స్ సంఘం రెంటల్కు అంగీకరించింది. జూన్ 30 నుంచి విడుదలయ్యే సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శించాలను ఎగ్జిబిటర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం