దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ఉద్యోగులకు భారీ బోనస్‌లు ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా సెమీకండక్టర్ వ్యాపారంలో వచ్చిన భారీ లాభాలను ఉద్యోగులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. గత త్రైమాసికంలో సామ్‌సంగ్ ఆదాయం 49 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో చిప్ విభాగానికి చెందిన ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.3 కోట్లు) అందించనుంది. సంస్థ చిప్ విభాగం ఉద్యోగులు చేపట్టిన సమ్మె బోనస్‌కు ప్రధాన కారణమని వార్తలు వస్తున్నాయి.