ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777- 300 ER బుధవారం శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది. ఇందులో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగా దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం 8 గంటలు గాల్లోనే తిరగాల్సి వచ్చింది. ఈక్రమంలో చైనా గగనతలం నుంచి విమానం దిల్లీకి తిరిగి ప్రయాణించింది. దిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని విమానయాన సంస్థ పేర్కొంది. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది.