ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ప్రజల నిరసన సెగలు తగలాలి అని అన్నారు.జూన్ 12న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు.