తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్లో బిల్లు పాసైనా… అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. బిగ్ అనౌన్స్ మెంట్ అని ఉదయం పెట్టిన పోస్టుకు అనుగుణంగా తన ప్రసంగంలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని నారా లోకేశ్ ప్రకటించారు.