ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ‘‘నాటి విజన్ 2020.. నేటి స్వర్ణాంధ్ర 2047 యువత కోసమే. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది. ఇప్పుడు ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వంటివన్నీ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇక ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అని నిరూపించాం. సోషల్ సైకోల తాటతీసి.. మహిళల గౌరవాన్ని కాపాడతాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు