ఓటరు జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారాలను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఆర్టికల్ 324 ప్రకారం ECకి పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో దీనిపై సుదీర్ఘ విచారణ జరగ్గా.. అనంతరం ఈ తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఏ చట్టాన్ని లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.