వనపర్తి జిల్లాలో ఖిల్లా ఘనపురం మండల సల్కిలాపురం గ్రామంలో భార్య ఇద్దరు పిల్లలను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సల్కిలాపురం గ్రామంలో నరసింహి అనే వ్యక్తి(40), భార్య(36), ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. సల్లిలాపురంలో మామిడి తోట లీజుకు తీసుకుని జీవిస్తున్నట్టు సమాచారం. ఇద్దరు పిల్లలు ఎనిమిదో, పదో తరగతి చదువుతున్నారు. పిల్లలను సంపులో పడేసి, భార్యకు ఉరివేసి, అనంతరం నరసింహ చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతులు దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.