ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కల్లాల్లో తడిసి ముద్దయిన వడ్లు.. ఆంక్షలు లేకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి. వారం రోజుల పాటు ఇసుక రవాణా ఆపి.. ఆ లారీలను ధాన్యం కోసం వాడాలి. క్వింటాల్‌కు 5 కిలోల తరుగు, ఏ-గ్రేడ్‌కు బీ-గ్రేడ్ ధరతో రైతులను నిలువునా దోచుకుంటున్న మిల్లర్లు అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు.