loader

ఆ విరాళాల సేకరణతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదు

ప్రముఖ నటుడు ఎన్టీఆర్ (Jr NTR) పేరుని వాడుకుంటూ కొందరు విరాళాలు సేకరించడాన్ని ఖండిస్తూ.. నటుడి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. వాటితో ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. “కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ పేరుతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఆయనకు సంబంధం లేదు. ఎన్టీఆర్, ఆయన ఆఫీస్ తో సంబంధం ఉన్నట్లుగా చెబుతూ కొనసాగిస్తున్న కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని […]

అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

పెరుగుతున్న సేకరణ ఖర్చులకు ప్రతిస్పందనగా మదర్ డెయిరీ పాల ధరలను పెంచింది. వివిధ రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2026 మే 14, గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. మదర్ డెయిరీకి ముందు అముల్ కూడా లీటరుకు రూ.2 చొప్పున పాల ధర పెంపును ప్రకటించింది. తమ పాల అమ్మకాల ఆదాయంలో సుమారు 75 నుండి 80 శాతం వరకు రైతులకు చెల్లిస్తున్నామని కంపెనీ వివరించింది.

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో బుర్ఖాకు గ్రీన్ సిగ్నల్

కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థల్లో వస్త్రధారణపై సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులు యూనిఫాంతో పాటు హిజాబ్, జనివార (జంద్యం), టర్బన్ (పాగా) వంటి మతపరమైన చిహ్నాలు ధరించడానికి అనుమతినిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీజేపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ విద్యాశాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం తరగతులు, పరీక్షల సమయంలో విద్యార్థులు తమ సాంప్రదాయ చిహ్నాలైన రుద్రాక్షలు, శివధార, స్కార్ఫ్ వంటివి ధరించవచ్చు.

చంద్రబాబు కాన్వాయ్‌ సగానికి తగ్గింపు

ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌ వాహనాల కుదింపునకు ఆదేశించారు. జిల్లా పర్యటనల్లో కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని తెలిపారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తో భేటీలో ఈమేరకు స్పష్టం చేశారు. మంత్రులు, వీఐపీలు కూడా వీలైనంత తక్కువ వాహనాలు వాడేలా చూడాలని ఆదేశించారు. 50 శాతం వాహనాల తగ్గింపు అన్ని స్థాయుల్లోనూ అమలయ్యేలా చూడాలన్నారు.

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

త‌మ సినిమాల రిలీజ్ ఉన్న‌పుడు శిరీష్ ఏమీ మాట్లాడ‌ర‌ని.. కానీ వేరే వాళ్ల పెద్ద సినిమాల విడుద‌ల‌కు ముందే ఆయ‌న‌కు ఎగ్జిబిట‌ర్ల స‌మ‌స్య‌లు గుర్తుకు వ‌స్తాయ‌ని ర‌విశంక‌ర్ కౌంట‌ర్ వేశారు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టైంలో ఈ స‌మ‌స్య మొద‌లైందని.. ఆ త‌ర్వాత శిరీష్ వార్ 2, కూలీ, ఓజీ, మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమాల‌ను రిలీజ్ చేశారని.. ఈ సినిమాలన్నీ విడుద‌ల చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు ఆయ‌న‌కు కనిపించలేదా అని నిర్మాత‌ల త‌ర‌ఫున మైత్రీ మూవీస్ […]

రెండు వాహనాలతో నరేంద్ర మోదీ కాన్వాయ్..నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

ప్రధాని మోదీ ప్రజలకు చెప్పడమే కాదు.. పొదుపు మంత్రాన్ని ఆచరణలో చూపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్ ను 50 శాతం వాహనాల్ని తగ్గించాలని ఎస్పీజీని ఆదేశించారు. ఈ క్రమంలో ప్రధాని కాన్వాయ్ లో జామర్ యూనిట్ల సహా కనీసం 12 నుంచి 15 కార్లు ఉండేవి. మోదీ ఆదేశించడంతో ప్రస్తుతం రెండు కార్లు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ పొదుపు మంత్రాల్ని ప్రజలకు చెప్పడమే కాకుండా ఆచరించి చూపించారు.

నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడికి సీబీఐ కస్టడీ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన శుభమ్ ఖైర్నార్‌ను సీబీఐ అధికారులు బుధవారం ముంబైలోని కిల్లా కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడికి రెండు రోజుల ట్రాన్సిట్ కస్టడీ మంజూరు చేసింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి లీకైన ప్రశ్నపత్రం హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, బీహార్, కేరళ వంటి పలు రాష్ట్రాలకు చేరినట్లు సీబీఐ అనుమానిస్తోంది.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంకేతాలు

తాజాగా ఆర్బీఐ గవర్నర్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెరుగుతున్న క్రూడాయిల్ ధరలను భరిస్తూ రిటైల్ ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. IMF సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ ఆర్థిక సమావేశంలో ఆయన ఈ […]

భారత్‌కు చమురు సరఫరాలో ఎలాంటి ఆటంకం రానివ్వం : రష్యా

మిత్రదేశం భారత్‌ కు చమురు సరఫరాలో ఎలాంటి ఆటంకం రానివ్వమని రష్యా హామీ ఇచ్చింది. భారత్‌ విషయంలో చమురు సరఫరాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ నెరవేరుస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు స్నేహంపై ఆధారపడి ఉన్నాయని, వాటి దారులు వేరయ్యే పరిస్థితి ఏమాత్రం ఉండదని అన్నారు. ఇంధన సరఫరాల బాధ్యతలను నెరవేర్చడంలో రష్యా ఎన్నడూ విఫలం కాలేదని చెప్పారు.

నీట్‌ లీక్‌ కేసులో.. బీజేపీ యువ నేత, అతడి సోదరుడు అరెస్ట్‌

దేశ వ్యాప్తంగా NEET‌ పేపర్‌ లీక్‌ కేసులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సోదరులను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారిలో ఒకరు బీజేపీ నాయకుడు. బీజేపీ యుజన విభాగం నాయకుడు దినేష్ బివాల్, అతడి సోదరుడు మంగీలాల్ బివాల్‌, హర్యానాకు చెందిన ఒక వ్యక్తి నుంచి నీట్ 2026కు సంబంధించిన 120 ప్రశ్నల గెస్ పేపర్‌ను అందుకున్నారు. ఆ గెస్‌ పేపర్‌ను రూ.15 లక్షలకు వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సికర్‌లోని పలువురు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON