పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగంగుంటకు చెందిన బోడపాటి నవీన్ చౌదరిని అరెస్టు చేసిన పోలీసులు. టీటీడీ ఉద్యోగిని అంటూ బురిడీ కొట్టించాడు కేటుగాడు. శ్రీవారి దర్శనంతో పాటు గదులు ఇప్పిస్తానని భక్తులను మోసం చేసినట్లు తేలింది. ఫోన్ పే ద్వారా డబ్బు లాగేస్తూ మోసాలకు పాల్పడ్డ నవీన్ చౌదరి.. తాజాగా హైదరాబాద్కు చెందిన జర్నలిస్ట్ సూర్యకళ కుటుంబాన్ని మోసగించాడు. యూపీఐ ద్వారా రూ. 47 వేలు, దర్శనం, వసతి పేరుతో మరో రూ. 18 వేలు నగదు తీసుకొని అదృశ్యం అయ్యాడు.