ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. కావేరీ ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా భీమవరం అడ్డరోడ్డు వద్ద బస్సులో నుంచి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దిగమని చెప్పాడు. వెంటనే వారు కిందకు దిగా ప్రాణాలు దక్కించుకున్నారు. డ్రైవర్ సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది