ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేటి (శుక్రవారం, మే 15) నుంచి అత్యంత కీలకమైన ఐదు దేశాల పర్యటనను ప్రారంభించారు. 6 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన యూఏఈతో పాటు నాలుగు ఐరోపా దేశాల్లో (నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ మొదట యూఏఈ రాజధాని అబుదాబి చేరుకుంటారు.