loader

మే 26న కేర‌ళకు నైరుతీ రాక‌.. రుతుప‌వ‌నాల‌పై ఐఎండీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుప‌వ‌నాల మే 26వ తేదీ వ‌ర‌కు కేర‌ళ‌లో ప్ర‌వేశించ‌నున్న‌ట్లు ఐడీఎం తెలిపింది. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జూన్ ఒక‌టో తేదీ వ‌ర‌కు నైరుతీ రుతుప‌వ‌నాలు కేర‌ళ చేరుకుంటాయి. ఆ రుతుప‌వ‌నాలు కేర‌ళ చేరుకోవ‌డంతో భార‌త్‌లో వ‌ర్షాకాలం మొద‌లువుతుంది. గ‌త ఏడాది మే 24వ తేదీన కేర‌ళ‌కు నైరుతీ రుతుప‌వ‌నాలు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది మాత్రం మే 26వ తేదీన ప్ర‌వేశించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ అంచ‌నా వేసింది.

మోదీ విమానానికి ఎస్కార్ట్‌.. ఫైటర్‌ జెట్‌తో యూఏఈ ప్రత్యేక స్వాగతం

ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది. మోదీని యూఏఈ ప్రత్యేకంగా స్వాగతించింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం శుక్రవారం మధ్యాహ్నం యూఏఈ గగతనలంలోకి ప్రవేశించగానే.. ఆ దేశ ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌గా వచ్చింది. తమ వాయుసేన కోసం ప్రత్యేకంగా రూపొందించిన యుద్ధ విమానం ఎఫ్‌-16 బ్లాక్‌ 60 ‘డెజర్ట్ ఫాల్కన్‌’ను పంపింది. అబుదాబిలో ప్రధాని విమానం ల్యాండ్ అయ్యేవరకు వెంటే వచ్చింది.

యూఏఈ పర్యటనలో మోదీ కీలక ఒప్పందాలు.. రక్షణ, ఇంధన రంగాల్లో భారీ డీల్స్

ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా భారత్-యూఏఈ సంబంధాలను మరింత బలోపేతం చేసే పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రక్షణ, ఇంధన, మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ ఒప్పందాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన రూపరేఖలపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. అలాగే వ్యూహాత్మక చమురు నిల్వలు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సరఫరాకు సంబంధించిన ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగాయి. వడినార్‌లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం […]

మోదీ, రాజ్‌నాథ్‌, చంద్రబాబు.. ముగ్గురూ 75 ఏళ్ల కుర్రాళ్లు: మంత్రి లోకేశ్‌

ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమలు పుట్టపర్తికి తెచ్చిన వ్యక్తి సీబీఎన్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పుట్టపర్తిలో ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. “1991లో సత్యసాయిబాబా ఎయిర్ పోర్టు నిర్మిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయన విజన్ ఇప్పుడు చూస్తున్నాం. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు.. ముగ్గురికీ 75 ఏళ్లు అయినా 25 ఏళ్ల కుర్రాళ్లలా […]

యూఏఈ పర్యటనలో మోదీకి ఘనమైన అధికారిక స్వాగతం

యూఏఈ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రెసిడెన్షియల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు ఘనమైన అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. అబుదాబిలో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల్లో ప్రధాని మోదీ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య యూఏఈపై జరిగిన ఇటీవలి ఇరాన్ దాడులను ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా చూసుకుందని ఆయన […]

డ్రోన్‌ టెక్నాలజీ ఓ గేమ్‌ ఛేంజర్‌: రాజ్‌నాథ్‌

రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పబ్లిక్‌, ప్రైవేటు రంగాలు చేయిచేయి కలిపి నడుస్తున్నాయని తెలిపారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఆయుధాల తయారీ రంగంలో స్వావలంబన దిశగా కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. యుద్ధ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీ ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలిచింది. 8 డ్రోన్‌ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్‌ సిటీ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక నుంచి కర్నూలును […]

60 లీటర్ల చనుబాలు దానం చేసిన గుత్తా జ్వాల..ఎంత పుణ్యం తల్లీ..!

భారత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాల .. ఇప్పుడు ఒక తల్లిగా కోట్లాది మంది మనసులను గెలుచుకుంటున్నారు. తన బిడ్డకు పాలిస్తూనే.. ఆ భాగ్యం లేని అనాథలు, అనారోగ్యంతో ఉన్న పసిపాపల ఆకలి తీర్చి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తన బాబు పుట్టిన మొదటి ఏడాదిలో సుమారు 60 లీటర్ల తల్లిపాలను హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులలోని మిల్క్ బ్యాంక్‌లకు ఆమె విరాళంగా ఇచ్చారు. కేవలం 100 మిల్లీలీటర్ల తల్లిపాలు,కిలో బరువున్న పసిబిడ్డకు కొన్ని […]

‘కుల వ్యవస్థను నిర్మూలించాలన్నదే నా వ్యాఖ్యల ఉద్దేశం’- ఉదయనిధి స్టాలిన్‌ క్లారిటీ

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న వేళ తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, ప్రజలను అగ్ర, నిమ్న కులాల పేరుతో విభజించే వ్యవస్థను మాత్రమే నిర్మూలించాలన్నది తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎవరూ ఆలయాలకు వెళ్లొద్దు అని చెప్పడం తన ఉద్దేశం కాదని వివరించారు. ఆలయాలతో పాటు సమాజంలో ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు.

దేశంలో ఆధునిక డ్రోన్ సిస్టమ్ ఎపిలో తయారైంది: చంద్రబాబు

పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబ గుర్తొస్తారని, సత్యసాయిబాబా బోధనలతో విశ్వశాంతికి కృషి చేశారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. పుట్టపర్తి దేశం గర్వించే రక్షణ కేంద్రంగా తయారవుతుందని తెలిపారు. యుద్దాల్లో వాడే డ్రోన్ కర్నూలు లో తయారు చేయడం ఎపికి గర్వకారణం అని దేశంలో ఆధునిక డ్రోన్ సిస్టమ్ ఎపిలో తయారైందని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమలో ఐరన్, ఓర్, టైమ్ స్టోన్ ఉందని, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.

పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5th Gen ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శ్రీకారం

పుట్టపర్తిలో శుక్రవారం నాడు దేశం గర్వించదగ్గ అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజలో పాల్గొన్నారు. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), డీఆర్డీఓ (DRDO) సంయుక్తంగా సుమారు రూ. 15,803 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును 650 ఎకరాల్లో నిర్మించనున్నాయి. ఇది భారత్‌లో మొట్టమొదటి 5వ తరం (5th Generation) స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON