ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా భారత్-యూఏఈ సంబంధాలను మరింత బలోపేతం చేసే పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రక్షణ, ఇంధన, మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ ఒప్పందాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన రూపరేఖలపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. అలాగే వ్యూహాత్మక చమురు నిల్వలు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాకు సంబంధించిన ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగాయి. వడినార్లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదిరింది.