సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న వేళ తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, ప్రజలను అగ్ర, నిమ్న కులాల పేరుతో విభజించే వ్యవస్థను మాత్రమే నిర్మూలించాలన్నది తన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఎవరూ ఆలయాలకు వెళ్లొద్దు అని చెప్పడం తన ఉద్దేశం కాదని వివరించారు. ఆలయాలతో పాటు సమాజంలో ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు.