భారతీయ వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాల మే 26వ తేదీ వరకు కేరళలో ప్రవేశించనున్నట్లు ఐడీఎం తెలిపింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ వరకు నైరుతీ రుతుపవనాలు కేరళ చేరుకుంటాయి. ఆ రుతుపవనాలు కేరళ చేరుకోవడంతో భారత్‌లో వర్షాకాలం మొదలువుతుంది. గత ఏడాది మే 24వ తేదీన కేరళకు నైరుతీ రుతుపవనాలు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది మాత్రం మే 26వ తేదీన ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది.