డిగ్రీ మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)- 2026 మొదటి విడతలో 56,147 మందికి సీట్ల కేటాయింపు చేశారు. వారిలో కామర్స్ విద్యార్థులు అత్యధికంగా 23,214 మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు నేటి(శుక్రవారం) నుంచి ఈ నెల 23 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దోస్త్-2026 మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి గురువారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు.

