దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్ ఫోర్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు.

