రాజధాని ప్రాంతమైన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశాబ్దాల నాటి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి రూ.1,167.50 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు పనులకు తాడేపల్లిలో శంకుస్థాపన చేశారు. రాజధాని కోర్ పరిధిలోకి వచ్చే నవులూరు, యర్రబాలెం, బేతపూడి, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి మినహా MTMC పరిధిలోని మిగిలిన అన్ని పట్టణ, విలీన ప్రాంతాలకు ఈ భూగర్భ డ్రైనేజీ సౌకర్యం కల్పించనున్నారు.