జీ7 సదస్సులో ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాధినేతలతో జార్జియా మాట్లాడుతూ.. తాను నిద్రలేవాలంటే కనీసం మూడు కప్పుల కాఫీ తాగాల్సిందేనని స్పష్టం చేశారు. జర్మన్ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ స్పందించారు. సిగరెట్ కూడా కావాలా? అని అడిగారు. ఇందుకు మెలనీ తాను నెల రోజుల కింద సిగరెట్ మానేశానని చెప్పుకొచ్చారు. జీ7 సదస్సులో ప్రధాని మోదీని కలిసిన మెలోనీ సరదాగా పలకరించారు. మిమ్మల్ని మళ్లీ కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇన్స్టాగ్రామ్లో మనమే అత్యంత ఫేమస్ అని చెప్పుకొచ్చింది.