తమ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నీట్ యూజీ పునఃపరీక్ష పరీక్షకు ముందు భద్రతకు సంబంధించిన ఎటువంటి లోపాలు తలెత్తకుండా అధికారులు సూచనల మేరకు కేంద్రం.. టెలిగ్రామ్ ను తాత్కాలికంగా బ్యాన్ చేసింది. పరీక్షకు ముందే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు పిడిఎఫ్ రూపంలో ప్రచారంలోకి రావడంతో పరీక్ష విశ్వసనీయత దెబ్బతిందని సిబిఐ పేర్కొంది.