టెక్సాస్ లోని లారెడో నగరంలో లారెడో అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న సెసనా 680 సైటేషన్ లాటిట్యూడ్ (రిజిస్ట్రేషన్ సంఖ్య N523QS) రకానికి చెందిన ఈ చిన్న ప్రైవేట్ జెట్ విమానం ల్యాండ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు నియంత్రణ కోల్పోయి హైవేపై వెళ్తున్న ఒక పికప్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విమానంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.