కాశ్మీర్‌పై అమెరికా కొత్త వివాదం..భారత సరిహద్దులను మార్చేసిన మ్యాప్!
2018 నుంచి అమల్లో ఉన్న యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM) పేరును తిరిగి యూఎస్ పసిఫిక్ కమాండ్ (USPACOM)గా మార్చింది. జూన్ 16న విడుదల చేసిన అధికారిక సమాచారంలో ఉపయోగించిన మ్యాప్‌లో భారతదేశ భౌగోళిక సరిహద్దులను తప్పుగా చూపించారని భారతీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ పటంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు ప్రధాన భారత భూభాగం నుంచి వేరుగా కనిపించగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పాకిస్తాన్‌లో భాగంగా చూపించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

