తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఇప్పటికే 1814 మంది విద్యార్థులు చేరడం విశేషమని, ఒక ప్రభుత్వ పాఠశాలకు ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే పరిస్థితి రావడం నిజంగా హర్షణీయమని సీఎం పేర్కొన్నారు. ఈ విజయం సాధించిన ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో మరిన్ని కీలక మార్పులు తీసుకువస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు విద్యా కిట్లను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.