loader

ఎట్టకేలకు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. జులై 9న ఖనన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఖమేనీ అంత్యక్రియలు 5 రోజుల పాటు జరగనున్నాయి. జులై 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భౌతికకాయాన్ని టెహ్రాన్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 7వ తేదీన పవిత్ర నగరం ‘కోమ్ ‘లో మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 9న ఖమేనీ స్వస్థలమైన మర్హాద్లోని ‘ఇమామ్ రెజా ప్లైన్’ వద్ద అంతిమ ఖననం […]

నెయ్మార్ లేకుండానే బరిలోకి బ్రెజిల్.. తొలి మ్యాచ్‌కు ముందు పెరిగిన ఆందోళన

గత మూడు ప్రపంచకప్‌లలో బ్రెజిల్ జట్టు వ్యూహాలన్నీ నెయ్మార్ చుట్టూనే తిరిగాయి. 2014లో అద్భుత ఫామ్‌లో ఉన్న సమయంలో గాయం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది 2018లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. 2022లో క్రొయేషియాపై నెయ్మార్ గోల్ చేసినా, చివరకు పెనాల్టీల్లో బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మరోసారి గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్ ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరగనుంది.

ప్రధాని మోదీని ఔరంగజేబుతో పోల్చిన సంజయ్ రౌత్

శివసేన సీనియర్ నాయకుడు, సంజయ్ రౌత్ ప్రధానమంత్రి మోదీని తీవ్ర విమర్శలు గుప్పించారు. “మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జన్మించిన గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా పుట్టారు. అంటే ఇద్దరూ ఒకే మట్టి నుంచి వచ్చినవారే కదా?” అని ఆయన ప్రశ్నించారు. మోదీ రాజకీయ శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రౌత్.. ఆయన్ను ఒక ‘అఘోరి’గా, అత్యంత ‘కఠిన హృదయుడైన వ్యక్తి’గా అభివర్ణించారు. దేశ రాజకీయ చరిత్రలో ఇంతటి క్రూరమైన మనస్తత్వం ఉన్న నేతను […]

రేపు హైద‌రాబాద్‌కు కాక్రోచ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు..!

నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 14న ఆదివారం కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే హైదరాబాద్ కు రానున్నారు. ఈ నిరసనలపై పార్టీ కొద్ది రోజుల కిందనే అధికారిక ఇన్స్టా ఖాతాలో షెడ్యూల్ విడుదల చేసింది.

‘పురుషుల శవాల’మర్మాంగాలపై అనుచిత వ్యాఖ్యలు.. ఎంబీబీఎస్ విద్యార్థినికి షాకిచ్చిన కాలేజీ

కమేడియన్ షోలో ‘పురుషుల శవాల’పై వివాదాస్పద వ్యాఖ్యల వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముంబయి కేఈఎం మెడికల్ కాలేజీ యాజమాన్యం విద్యార్థిని సేజల్ పవార్‌ను రెండు వారాల నిర్బంధ సెలవుపై పంపింది. ఈ సమయంలో ఆమెను కాలేజీ, హాస్టల్ పరిసరాల్లోకి రాకుండా నిషేధించినట్టు పేర్కొంది. ఒక వైద్య విద్యార్థినికి ఉండాల్సిన గౌరవం, వృత్తి పరమైన బాధ్యతలకు భిన్నంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. ఆమె భద్రతను దృష్టిలో ఉంచుకుని, కుటుంబ సభ్యులకు […]

కాంగ్రెస్‌లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే

మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) విలీన వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పష్టతనిచ్చారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు.  కాంగ్రెస్ పార్టీ నుండి తమకు ఎలాంటి విలీన ప్రతిపాదనలు రాలేదని, తమ వైపు నుండి కూడా అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదని ఆమె తేల్చి చెప్పారు.

భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్

ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను నియమించింది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా ఆయనకు 62 ఏళ్లు వయస్సు వచ్చే వరకు. ఈ రెండింటిలో ఏది ముందు వస్తే.. అది వర్తిస్తుంది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెలంట్ జనరల్ ధీరజ్ […]

విప్లవం, సనాతనం.. ఇదే మా విధానం – పవన్ కళ్యాణ్

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ యావత్ తెలుగు సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వారసత్వమే జనసేన పార్టీకి అసలైన స్ఫూర్తి అని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ నడుస్తున్న తీరుకు దాశరథి జీవితమే ఒక దిక్సూచి అని పేర్కొంది. సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న గొప్ప జ్ఞాని అని జనసేన కొనియాడింది.

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్​నాథ్​

దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని దుండిగల్​ ఎయిర్​ఫోర్స్​ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్​కు రివ్యూయింగ్​ ఆఫీసర్​గా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్​నాథ్​సింగ్ మాట్లాడారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్​ ఫోర్స్​ చాలా కీలకమని పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు.

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ సెమీస్‌లో ఓడిన పీవీ సింధు

ఆస్ట్రేలియ‌న్ బ్యాడ్మింట‌న్ ఓపెన్ టోర్నీలో హైద‌రాబాదీ ప్లేయ‌ర్ పీవీ సింధు ఇవాళ సెమీఫైన‌ల్లో ఓటమి చ‌వి చూసింది. జ‌పాన్‌కు చెందిన మేటి ప్లేయ‌ర్ అకేన్ య‌మ‌గుచి చేతిలో ఆమె వ‌రుస గేమ్స్‌లో ప‌రాజ‌యాన్ని ఎదుర్కొన్న‌ది. 20-22, 12-21 స్కోరుతో య‌మ‌గుచి విజ‌యం సాధించింది. మూడో నెంబ‌ర్ ర్యాంక్‌తో జ‌ప‌నీస్ ప్లేయ‌ర్ ఈ టోర్నీలో ఆడారు. కేవ‌లం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. సింధు ఓట‌మితో బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ టూర్ సూప‌ర్ 500 టోర్న‌మెంట్‌లో భార‌తీయ క్రీడాకారుల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON