తెలంగాణ వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మొదటి రోజే నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఉపాధ్యాయులు రామ్ చరణ్ స్కూట్ గేటుకు తోరణాలు కట్టించారు. ఈ క్రమంలో రామ్ చరణ్కు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఉపాధ్యాయులు,
స్థానికులు విద్యార్థిని దేవరకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.