“దిల్లీ మెడలు వంచుతాం, మా తడాఖా చూపిస్తాం అంటూ చాలామంది నేతలు పెద్ద పెద్ద మాటలు చెబుతారు. కానీ, వాస్తవానికి అలాంటి నాయకులు దిల్లీకి రాగానే భయంతో వెనక్కి తగ్గుతారు” అని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చురకలు అంటించారు. జాతీయవాదాన్ని, దేశభక్తిని నిజంగా అర్థం చేసుకోవాలంటే దిల్లీ కేంద్రంగానే మాట్లాడాలని ఆయన స్పష్టం చేశారు. దిల్లీలో జనసేన ప్రజాప్రతినిధులతో జరిగిన ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ ఉన్నత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు.