కమేడియన్ షోలో ‘పురుషుల శవాల’పై వివాదాస్పద వ్యాఖ్యల వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముంబయి కేఈఎం మెడికల్ కాలేజీ యాజమాన్యం విద్యార్థిని సేజల్ పవార్‌ను రెండు వారాల నిర్బంధ సెలవుపై పంపింది. ఈ సమయంలో ఆమెను కాలేజీ, హాస్టల్ పరిసరాల్లోకి రాకుండా నిషేధించినట్టు పేర్కొంది. ఒక వైద్య విద్యార్థినికి ఉండాల్సిన గౌరవం, వృత్తి పరమైన బాధ్యతలకు భిన్నంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. ఆమె భద్రతను దృష్టిలో ఉంచుకుని, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు