మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) విలీన వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పష్టతనిచ్చారు. తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి తమకు ఎలాంటి విలీన ప్రతిపాదనలు రాలేదని, తమ వైపు నుండి కూడా అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదని ఆమె తేల్చి చెప్పారు.