భారత్-పాక్ మహిళా క్రికెటర్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. నానా మాటలు అనుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్ ను ఓ భారత క్రికెటర్ గొంతు పట్టుకున్నట్లు కూడా వీడియో వైరల్ అవుతోంది. ఫ్యాక్ట్ చెక్ చేస్తే అసలు ఎడ్జ్ బాస్టన్ మైదానంలో అలాంటి ఘటనేదీ జరగలేదని తేలింది. కానీ ఈ ఘటన జరిగినట్లుగా కొందరు డీప్ ఫేక్ ద్వారా వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలినట్లు తేలింది. ఇది తెలియక భారత్-పాక్ అభిమానులు ఇంటర్నెట్ లో పరస్పరం రెచ్చిపోతున్నారు