ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్ కలిసి ఓ మెగా స్కామ్ రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు.ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది అని వైఎస్ జగన్ ఎక్స్ ట్వీట్ చేశారు..

