మిత్రదేశం భారత్ కు చమురు సరఫరాలో ఎలాంటి ఆటంకం రానివ్వమని రష్యా హామీ ఇచ్చింది.
భారత్ విషయంలో చమురు సరఫరాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ నెరవేరుస్తామని రష్యా విదేశాంగ
మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. రెండు దేశాల
మధ్య సంబంధాలు స్నేహంపై ఆధారపడి ఉన్నాయని, వాటి దారులు వేరయ్యే పరిస్థితి ఏమాత్రం ఉండదని అన్నారు.
ఇంధన సరఫరాల బాధ్యతలను నెరవేర్చడంలో రష్యా ఎన్నడూ విఫలం కాలేదని చెప్పారు.

