దేశ వ్యాప్తంగా NEET పేపర్ లీక్ కేసులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సోదరులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు బీజేపీ నాయకుడు. బీజేపీ యుజన విభాగం నాయకుడు దినేష్ బివాల్, అతడి సోదరుడు మంగీలాల్ బివాల్, హర్యానాకు చెందిన ఒక వ్యక్తి నుంచి నీట్ 2026కు సంబంధించిన 120 ప్రశ్నల గెస్ పేపర్‌ను అందుకున్నారు. ఆ గెస్ పేపర్‌ను రూ.15 లక్షలకు వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సికర్‌లోని పలువురు విద్యార్థులకు దానిని విక్రయించినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు.

