ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ వాహనాల కుదింపునకు ఆదేశించారు. జిల్లా పర్యటనల్లో కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని తెలిపారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌తో భేటీలో ఈమేరకు స్పష్టం చేశారు. మంత్రులు, వీఐపీలు కూడా వీలైనంత తక్కువ వాహనాలు వాడేలా చూడాలని ఆదేశించారు. 50 శాతం వాహనాల తగ్గింపు అన్ని స్థాయుల్లోనూ అమలయ్యేలా చూడాలన్నారు.

