loader

రాజేందప్రసాద్‌, మురళీ మోహన్‌లను సత్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి

పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన రాజేందప్రసాద్‌, మురళీ మోహన్‌లను మెగాస్టార్‌ చిరంజీవి సత్కరించారు. ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి శాలువా కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ పురస్కారాలు తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

గణతంత్ర వేడుకల్లో అంగన్వాడీ టీచర్.. ప్రత్యేక షీల్డ్ బహూకరించిన కేంద్రమంత్రి ..!

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అంగన్వాడీ ప్రాజెక్టు కూలీలైన్ సెక్టార్‌ అంగన్వాడీ టీచర్ జే ప్రసన్న లక్ష్మి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు ప్రత్యేక వసతి కల్పించి గణతంత్ర వేడుకలను తిలకించే అవకాశం కల్పించారు. అంగన్వాడీ టీచర్‌గా జే.ప్రసన్న లక్ష్మి విశేష సేవలందించారు. సొంత ఖర్చులతో పిల్లలకు ఆహ్లాదంగా ఉండే వాతావరణాన్ని కల్పించి పేరు తెచ్చుకున్నారు. చిన్న ఉద్యోగమైనా బాధ్యతగా పని చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రసన్న లక్ష్మికి ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఆహ్వానం […]

ఎయిర్‌పోర్టులో మహిళ కన్నీళ్లు.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు..

సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ను చూసేందుకు కొంతమంది మహిళలు ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. పవన్ కల్యాణ్.. తన సతీమణితో కలిసి వారి వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన ప్రేమ కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్ద కన్నీరు పెట్టుకుంది. తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, తనకు సాయం చేయాలని కోరింది. పవన్ వెంటనే ప్రేమ […]

బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం ఓ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం దివిటిపల్లి వద్ద చోటుచేసుకుంది. దీంతో జాతీయ రహదారిపై 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్టున్నారు.

బ్రిటిష్ పాలనపై ‘రణబాలి’ ఉక్కుపాదం – విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ , ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ కాంబోలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా రాబోతోన్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. దీంతో పాటే ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ‘రణబాలి’ని ఫిక్స్ చేశారు మేకర్స్. ‘ఇది స్వాతంత్ర్యానికి సంబంధించిన స్టోరీ కాదు. అంతకు ముందు ఉన్న చీకటి కోణం ఈ […]

కాలిబూడిదైన బిస్కెట్ ఫ్యాక్టరీ..

గ్రీస్‌లోని ట్రికాలా నగర సమీపంలో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు అనంతరం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు కనిపించకుండా పోయినట్లు అగ్నిమాపక శాఖ వెల్లడించింది. ఫ్యాక్టరీ నుంచి దట్టమైన నల్ల పొగ ఆకాశంలోకి ఎగసిపడింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 40 మంది ఫైర్ ఫైటర్లు, 13 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. ప్రాంతీయ అధికారుల ప్రకారం ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

లోక్‌భవన్‌లో ఘనంగా ఎట్‌ హోం.. ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

నగరంలోని లోక్‌భవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్వహించిన ‘ఎట్‌ హోం’ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు గవర్నర్ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ను ప్రదానం చేశారు. ఈ తేనీటి విందులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్ […]

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌ రావుకు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఈ కేసులో తాజాగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌ రావుకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణకు రావాలని సంతోష్‌ రావుకు అందజేసిన నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సంతోష్‌ రావు మాట్లాడుతూ.. రేపు సిట్ విచారణకు హాజరవుతా.. సిట్ ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు.

రెడ్ బుక్‌కు నా కుక్క కూడా భయపడదు.. అంబటి రాంబాబు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ రెడ్ బుక్‌కు తన కుక్క కూడా భయపడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అంబటి రాంబాబు పరామర్శించారు. నారా లోకేష్ రెడ్ బుక్‌లో తన పేరుందో లేదో చూసి చెప్పాలన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తున్నారనే తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఆలయాలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు […]

కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి

అల్లూరి  జిల్లా చింతపల్లి మండలం పెంటపాడు గ్రామానికి చెందిన మహిళలు పాంగి సావిత్రి,కొర్ర సుశీల రహదారి పక్కన రోజూ కూరగాయలు అమ్ముతుంటారు.రింతాడ గ్రామనికి చెందిన ఉపాధ్యాయుడు తన కారులో చింతపల్లి నుంచి రింతాడకు వెళ్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కొర్ర సుశీల ఘటనాస్థలిలోనే మృతి చెందింది. సావిత్రి తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON