భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అంగన్వాడీ ప్రాజెక్టు కూలీలైన్ సెక్టార్ అంగన్వాడీ టీచర్ జే ప్రసన్న లక్ష్మి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు ప్రత్యేక వసతి కల్పించి గణతంత్ర వేడుకలను తిలకించే అవకాశం కల్పించారు. అంగన్వాడీ టీచర్‌గా జే.ప్రసన్న లక్ష్మి విశేష సేవలందించారు. సొంత ఖర్చులతో పిల్లలకు ఆహ్లాదంగా ఉండే వాతావరణాన్ని కల్పించి పేరు తెచ్చుకున్నారు. చిన్న ఉద్యోగమైనా బాధ్యతగా పని చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రసన్న లక్ష్మికి ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఆహ్వానం వచ్చింది.

