మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దని, మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని, దీనిపై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా గెలిపించిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను పణంగా పెట్టవద్దని హితవు పలికిన ఆయన, ఈ అంశంపై తనతో చర్చకు సిద్ధమా అంటూ #justasking హ్యాష్ ట్యాగ్‌తో పవన్‌కు బహిరంగ సవాల్ విసిరారు.

