మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అంశంపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయని, కేవలం రాజకీయ లెక్కల కోసమే దేశాభివృద్ధిని పక్కన పెట్టాయని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ విఫలం కావడానికి ప్రతిపక్షాల తీరే కారణమని, వారికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు.

