సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ను చూసేందుకు కొంతమంది మహిళలు ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. పవన్ కల్యాణ్.. తన సతీమణితో కలిసి వారి వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన ప్రేమ కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్ద కన్నీరు పెట్టుకుంది. తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, తనకు సాయం చేయాలని కోరింది. పవన్ వెంటనే ప్రేమ కుమారి ఫిర్యాదును తీసుకోమని అధికారులను ఆదేశించారు.

