గ్రీస్‌లోని ట్రికాలా నగర సమీపంలో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు అనంతరం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు కనిపించకుండా పోయినట్లు అగ్నిమాపక శాఖ వెల్లడించింది. ఫ్యాక్టరీ నుంచి దట్టమైన నల్ల పొగ ఆకాశంలోకి ఎగసిపడింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 40 మంది ఫైర్ ఫైటర్లు, 13 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. ప్రాంతీయ అధికారుల ప్రకారం ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

