నగరంలోని లోక్‌భవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ ను ప్రదానం చేశారు. ఈ తేనీటి విందులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు.

