loader

విజయ్ సినిమా జననాయగన్ ‘తళపతి కచేరీ’ సాంగ్ అదుర్స్..

తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ ‘జననాయగన్’ సినిమా నుంచి ‘తళపతి కచేరీ’ అంటూ తొలి సింగిల్‌ని విడుదల చేశారు. యధావిధిగా అనిరుధ్ ఈ పాటకు మాస్ బీట్ అందించాడు. విజయ్, జనాలతో వేసిన స్టెప్స్ సింపుల్‌గా ఉన్నా.. అభిమానులకు కను విందు చేసేలా ఉన్నాయి. విజువల్స్ ‌కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది.

అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌.కె.అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ.. అద్వానీకి పూలగుచ్ఛం అందజేసి ఆప్యాయంగా పలకరించారు. 98వ ఏట అడుగుపెట్టిన అద్వానీ ఈ ఏడాది భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’తో సత్కరించబడిన విషయం తెలిసిందే.

ఉత్తరం రాయండి, రూ. 25,000 బహుమతి గెలుచుకోండి.. తపాలా శాఖ

డిజిటల్‌ యుగంలో మనం ఫోన్లు, చాట్స్, సోషల్‌ మీడియాతో మాట్లాడటం అలవాటు చేసుకున్నాం. ఒకప్పుడు మనసులోని భావాలను చెప్పడానికి ఉత్తరమే ఆధారం. ఈ అందమైన సంప్రదాయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే ఢాయీ అక్కర్ (Dhai Akhar) పోటీ 2025-26 సంవత్సరానికి కూడా ప్రకటించింది. ఈసారి థీమ్‌ ‘నీ రోల్ మోడల్‌కు ఉత్తరం రాయండి’ (Letter to My Role Model) అని ఉంది. ఉత్తరాలు Superintendent of Post […]

ఫినిషర్ రీచాకు డీఎస్పీ ఉద్యోగం..అత్యున్నత పౌర పురస్కారం

వరల్డ్ కప్ ఛాంపియన్ రీచా ఘోష్‌పై వరాల జల్లు కురిసింది. భారత జట్టు విజయంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం బెంగాల్‌లో ఘన స్వాగతంతో పాటు ఊహించని పదవి దక్కింది. శనివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో వికెట్ కీపర్, బ్యాటర్‌ను డీఎస్పీగా నియమించింది బెంగాల్ ప్రభుత్వం. విశ్వ విజేతగా దేశం, రాష్ట్రం ఖ్యాతిని ఇనుమడింపజేసిన రీచాను సన్మాన వేడుకలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. తనదైన దూకుడుతో టీమిండియా చరిత్ర సృష్టించడంలో కీలకమైన రీచాకు స్వరాష్ట్రం […]

బ్యాట్ పట్టుకోలేడు కానీ ఐసీసీ ఛైర్మనా ? జై షాపై రాహుల్ పంచ్ లు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, ఐసీసీ ఛైర్మన్ కూడా అయిన జై షాపై విమర్శలు గుప్పించారు. “మీరు అదానీ, అంబానీ లేదా అమిత్ షా కొడుకు అయితేనే మీరు పెద్దగా కలలు కనగలరు. అమిత్ షా కొడుకు (జై షా)కి బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, పరుగు తీయడం మర్చిపోండి. కానీ ఆయన క్రికెట్ చీఫ్. క్రికెట్‌లో ప్రతి దానినీ ఆయన నియంత్రిస్తాడు. ఆయన ప్రతిదీ ఎందుకు నియంత్రిస్తాడు? […]

కేసీఆర్ ముద్ర‌ను చెర‌ప‌డం నీ జేజ‌మ్మ‌తో కూడా కాదు..హ‌రీశ్‌రావు

జూబ్లీహిల్స్ ప్యాలెస్ కిటికీలో నుండి చూస్తే నీకు కనపడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా.. రోజూ మీ ఇంటికి వెళ్లేటప్పుడు కనిపించే టీ హబ్ గాని, స్టీల్ బ్రిడ్జి గాని కేసీఆర్ గారు కట్టింది కాదా.. అని హ‌రీశ్‌రావు అడిగారు. హైద‌రాబాద్ న‌గ‌రంపై కేసీఆర్ ముద్ర‌ను చెర‌ప‌డం నీ జేజ‌మ్మ‌తో కూడా కాదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

అమిత్‌షా రహస్య సమావేశాలు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణ

బిహార్ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేర సంచలన ఆరోపణలు చేశారు. ‘హోం మంత్రి ఎప్పుడు పాట్నా వచ్చినా హోటల్ ఎలివేటర్లలోని సీసీటీవీ (కెమెరాలు)పై పేపర్లు అంటిస్తున్నారు. అధికారులతో ఆయన రహస్య మంతనాలు సాగిస్తున్నారు. అంత రహస్యంగా మీరు జరుపుతున్న సమావేశాలు ఏమిటి?’ అని అమిత్‌షాను ఆయన ప్రశ్నించారు. తొలి దశ పోలింగ్‌లో తమకు సానుకూలంగా లేకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలను కుదించుకున్నట్టు తెలిసిందని […]

తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్‌కు నిరసన సెగ..

పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ ఎదుట పలువురు ఆందోళనకు దిగారు. వీరిలో శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత కోట వినుత డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారూ.. మీరే న్యాయం చేయాలంటూ రాయుడు కుటుంబం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శించింది. రాయుడు పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అని, చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ.. జనసేన నుంచి స్పందన లేదని.. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం […]

బీహార్‌లో పోల్‌ స్లిప్స్‌ రోడ్డుపై పారవేత.. ఎన్నికల అధికారి సస్పెండ్‌

సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేఎస్‌ఆర్ కాలేజీ సమీపంలోని రోడ్డు వద్ద పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఒక అధికారిని సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటనపై ఈసీ స్పందించింది. పోలింగ్‌కు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) పరీక్షించేటప్పుడు మాక్‌ పోలింగ్‌ కోసం వినియోగించిన స్లిప్స్‌ అని తెలిపింది.

హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో గంజాయి కలకలం

హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు బేగంపేటలోని కులినరి అకాడమీ ఆఫ్ ఇండియాలో విద్యార్థులకు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం వచ్చింది. కాలేజీలో పార్టీ ఏర్పాటు చేశారని, అందులో విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం రావడంతో ఈగల్ పోలీసులు దాడి చేసి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టిహెచ్‌సి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON