మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో 45 ఏళ్ల షీలా సోనార్ తుపాకీ, కత్తి, స్ప్రే, తాళం వంటి వస్తువులతో ప్రియుడి ఇంటికి వెళ్లింది. ప్రియుడి భార్య అయిన 40 ఏళ్ల సాధన మహేంద్ర సోన్‌పట్కర్‌పై ఉన్మాదంతో షీలా దాడి చేసింది. నేలపై పడిన ఆమె మెడపై ఆ తర్వాత ఛాతిపై పదిసార్లు కత్తితో పొడిచింది. సాధన అత్త ఏడుస్తూ ఈ దారుణాన్ని ఆపమని షీలాను వేడుకున్నది. తీవ్ర రక్తస్రావం వల్ల సాధన అక్కడికక్కడే మరణించింది. వివాహేతర సంబంధం ఈ హత్యకు కారణాలని పోలీస్ అధికారి తెలిపారు

